Share News

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం బాధ్యత

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:25 AM

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం పౌరుల బాధ్యత అని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం  బాధ్యత
మాటాడుతున్న ప్రొఫెసర్‌ అంజిరెడ్డి

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం పౌరుల బాధ్యత అని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్టీయూ భవన్‌లో సీపీఐ శత జయంతి ముగింపు ఉత్సవాలు కర్నూలు జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప అధ్యక్షతన నిర్వహించారు. బ్రిటీష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో వీరుల త్యాగాల ఫలితంతో స్వేచ్ఛ, సమానత్వం వచ్చిందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లా డుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. రమేష్‌, లలితమ్మ, రఘు రామమూర్తి, సుంకయ్య, రామకృష్ణారెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:25 AM