మాస్టర్ ట్రైనర్స్‌కి ఓరియంటేషన శిక్షణ
ABN , Publish Date - May 25 , 2025 | 12:03 AM
మండల స్థాయిలో 256 మంది యోగా ట్రైనర్స్‌కు ఓరియంటే షన శిక్షణ ఇస్తామని జాయింట్ కలెక్టర్ బి.నవ్య తెలి పారు.
256 మందికి శిక్షణ
జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు స్పోర్ట్స్, మే 24 (ఆంధ్రజ్యోతి): మండల స్థాయిలో 256 మంది యోగా ట్రైనర్స్‌కు ఓరియంటే షన శిక్షణ ఇస్తామని జాయింట్ కలెక్టర్ బి.నవ్య తెలి పారు. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో యోగాం ధ్ర-2025, యోగా సాధన, అవగాహన మాసోత్సవం సందర్భంగా మాస్టర్ ట్రైనర్స్‌కి ఓరియంటేషన ట్రైనింగ్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు రెండు కోట్ల మంది యోగా నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని మండల స్థాయిలోని ట్రైనర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇండోర్ స్టేడియం, అవుట్‌డోర్ స్టేడియంలో 256 మంది మాస్టర్ ట్రైనర్స్‌కు రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం శనివారం ఉదయం మురళీదేశాయ్ నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ యోగా వారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మొదలవుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఈవో శామ్యూల్ పాల్, సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్, డీఎస్‌డీవో భూపతిరావు, డీఏవో శ్రీనివాసులు, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాశ శెట్టి, యోగా చార్యులు ప్రసాద్, విజయ్ కుమార్, మునిస్వామి, మెడికల్ ఆఫీసర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.