సేంద్రీయ ఎరువులను వాడాలి
ABN , Publish Date - May 15 , 2025 | 11:57 PM
పర్యావరణానికి అనుకూలంగా ఉండే సేంద్రీయ ఎరువులను వాడాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.జయలక్ష్మి అన్నారు.
భూసారాన్ని రాబోయే తరాలకు అందించాలి
ఎన్‌జీ రంగా వసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి.జయలక్ష్మి
ఎస్సీ రైతులకు సేంద్రీయ ఎరువులు పంపిణీ
మహానంది, మే 15 (ఆంరఽధజ్యోతి): పర్యావరణానికి అనుకూలంగా ఉండే సేంద్రీయ ఎరువులను వాడాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.జయలక్ష్మి అన్నారు. గురువారం మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాల ఆవరణలో సేంద్రీయ వరి సాగు భూముల్లో సేంద్రీయ ఎరు వుల ప్రాచుర్యంపై గోస్పాడు మండ లంలోని ఎస్‌సీ రైతులకు అవగాహాన సదస్సును నిర్వహిం చారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులను వాడి భూసారాన్ని భావితరాలకు అందించాలన్నారు. ఆధునిక పద్ధతులతో రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిందన్నారు. వరిలో దిగుబడి పెంచుకోవడానికి సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. అనంతరం రైతులకు ఒక్కొక్కరికి 200 కేజీల వర్మికంపోస్టు, జీవన ఎరువులతోపాటు 2025-26 సంవత్సర వ్యవసాయ పంచాంగంను అందజేశారు. శాస్త్రవేత్త ఎల్.విజయ భాస్కర్, ఐసీఏఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధ కురాలు పి.వి గీతా శిరీష, వి. శివజ్యోతి పాల్గొన్నారు.