Share News

ట్రంప్‌ టారిఫ్‌లను వ్యతిరేకించాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:02 AM

ట్రంప్‌ టారిఫ్‌ల(సుంకాల) పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

ట్రంప్‌ టారిఫ్‌లను వ్యతిరేకించాలి
నిరసనలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

వామపక్ష నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ట్రంప్‌ టారిఫ్‌ల(సుంకాల) పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు రాజశేఖర్‌, సి.మహేష్‌ అధ్యక్షతన నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌, సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప మాట్లాడుతూ ట్రంపు భారతదేశంపై వేసిన పన్ను కారణంగా దేశంలో అత్యధి కంగా నష్ట పోయేది ఆంధ్రప్రదేశ్‌యే అన్నారు. కూటమి పాలకులే కాకుండా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా టారిఫ్‌పై స్పందించకపోవడం దారుణ మన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, జగన్నాథం, శ్రీనివాసులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:02 AM