కార్మికులను తొలగిస్తే సహించం
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:37 AM
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 50 ఏళ్లు పైబడిన పారిశుధ్య కార్మికులను తొలగిస్తే సహించమని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు హెచ్చరించారు.
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 50 ఏళ్లు పైబడిన పారిశుధ్య కార్మికులను తొలగిస్తే సహించమని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు హెచ్చరించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ ఉద్యోగాన్నే నమ్ముకుని జీవిస్తున్న పారిశుధ్య కార్మికులు ఉద్యోగం పోతే రోడ్డున పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు లేబర్ అధికారులు, డీఎంఈ నుంచి జీవో వస్తే తొలగించాలని, జీవో రాకుండానే తొలగించడం అన్యాయమన్నారు. పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు చట్టానికి తూట్లు పొడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.