Share News

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:29 AM

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
కరపత్రాలు విడుదల చేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

డోన రూరల్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించిన కరపత్రాలను ఆయ న విడుదల చేశారు. బుగ్గన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలొ కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను నిర్మాణానికి పూనుకుందన్నారు. వీటిలో 7 పూర్తి అయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలు బంద్‌ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ జరగకుండా ఆపేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తమ అధినేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన సప్తశైల రాజేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన జాకీర్‌ హుశేన, పార్టీ వలంటరీ విభాగపు జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్‌ డోన పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు మల్లికార్జునరెడ్డి, సోమేష్‌ యాదవ్‌, దినే్‌షగౌడు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:29 AM