Share News

ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకించండి

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:12 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ బేతంచెర్ల పట్టణంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం మోదీ గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపారు.

ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకించండి
బేతంచెర్లలో నిరసన తెలుపుతున్న సీపీఐ, సీపీఎం నాయకులు

సీపీఎం, సీపీఐ నాయకుల నిరసన

బేతంచెర్ల, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ బేతంచెర్ల పట్టణంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం మోదీ గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు రామాంజనేయులు, భార్గవ్‌, ఎల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విభజన హామీలు అమలు చేయని ప్రధాని పర్యటనలు రాష్ట్రానికి ఏం ప్రయోజనమో చెప్పాలని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో సామాన్యుడి నడ్డీ విరిచి రూ.55 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఒకవైపు జీఎస్టీ భారం తగ్గించి.. ప్రతి ఇంటికి రూ.15వేలు మేలు చేశామని అసత్య ప్రచారం నిర్వహించడానికి వస్తున్న మోదీ పర్యటనను వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు తిరుమలేష్‌, ఉదయ్‌, ఎల్లకృష్ణ, మధు, బాలు, ప్రదీప్‌, ఖదీర్‌, గోర్లగుట్ట రవి, ఎస్‌కకే బాషా, రామకృష్ణ, శ్రీనివాసులు, వెంటేశ్వర్లు, విష్ణు నారాయణ, రాజబాబు, రమణ నాగేశ్వ రరావు శ్రీరాములు, సోమన్న, సాయితేజ పాల్గొన్నారు.

బనగానపల్లె: ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా రాకను నిరసిస్తూ మోదీ గోబ్యాక్‌ అంటూ సీపీఐ, సీపీఎం నాయకులు బనగానపల్లెలోని పెట్రోల్‌ బంకు కూడలిలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన మాట్లా డుతూ మోదీ రాషా్ట్రనికి ప్రత్యేకహోదా విభజన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం చే యాలని, సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏడాది 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగలను మోసం చేశారన్నారు. సీపీఐ మండల కార్య దర్శి శివయ్య, సుబ్బారెడ్డి, సీపీఎం నాయకుడు సుబ్బయ్య పాల్గొన్నారు.

ప్యాపిలి: ప్రధాని మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనపై సీపీఐ, సీఐటీయూ వేర్వేరు గా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మోదీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు కె రాధాక్రిష్ణ, మహేష్‌, చిన్నరహిమాన, రంగ స్వామి, హమాలీ, ఆటో, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:12 AM