అదనపు పోలింగ్ కేంద్రాలపై అభిప్రాయం తెలపాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:18 AM
కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద అదనంగా మరో 60 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూపొందించిన ప్రతిపాదనలపై తమ అభిప్రా యాలను తెలపాలని రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద అదనంగా మరో 60 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూపొందించిన ప్రతిపాదనలపై తమ అభిప్రా యాలను తెలపాలని రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. గురువారం నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. సమావేశంలో తహసీల్దారు రవికుమార్, డిప్యూటీ తహసీ ల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న పాల్గొన్నారు.