ఓపీ 222లో క్యాన్సర్‌కు చికిత్స
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:10 AM
నగరంలోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఓపీ నెంబర్ 222లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అనుమానితులకు వైద్యసే వలు అందిస్తున్నట్లు రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డా.మహేశ్వర్ ప్రసాద్ అన్నారు.
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నగరంలోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఓపీ నెంబర్ 222లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అనుమానితులకు వైద్యసే వలు అందిస్తున్నట్లు రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డా.మహేశ్వర్ ప్రసాద్ అన్నారు. నగరంలోని ముజఫర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో డీపీఎంవో డా.ఉమతో కలిపి పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు, అపరిశుభ్రత, అబార్షన్, ఇతరత్ర కారణాలతో గర్బాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు. డీపీఎంవో డా.ఉమ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వాస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యురాలు డా.రోషిణి, డీపీవో విజయరాజు, కన్సల్టెంట్ సుధాకర్, ఖలీల్ పాల్గొన్నారు.