నష్టాల ఉల్లి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:08 PM
ఈయేడు ఉల్లి రైతులు నష్టాల బాట పట్టారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల గగ్గోలు మళ్లీ మొదలైంది.
పతనమైన ధర
క్వింటాం కనిష్ఠ ధర రూ.209
లబోదిబోమంటున్న రైతులు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఈయేడు ఉల్లి రైతులు నష్టాల బాట పట్టారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల గగ్గోలు మళ్లీ మొదలైంది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి అమ్మకానికి తెచ్చిన ఉల్లికి గిట్టుబాటు ధర అందక రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మార్కెట్ యార్డుకు 1,748 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. గరిష్ఠ ధర రూ.1,179లు, మధ్యస్థ ధర రూ.511, కనిష్ట ధర రూ.209లు మా త్రమే రైతులకు అందింది. రూ.209 కనిష్ఠ ధర అందడంతో కొంత మంది రైతులు కనీసం రవాణా ఖర్చులు కూడా సర్దుబాటు కాక కమీషన్ ఏజెంట్లతో అప్పు తీసుకొని డ్రైవర్లకు ఇచ్చారు. దీంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. మిగిలిన పంట ఉత్ప త్తుల ధరలు కూడా ఘోరంగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కమిటీ అధికారులు నాణ్యతను బట్టి రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టెండరు దాఖలు చేసే సమయంలో, తూకాలు వేసే సమ యంలో దరిదాపుల్లో కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.