వర్షానికి ఉల్లి రైతు కుదేలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:27 AM
మండలంలోని ఎర్రమల కొండల్లో సోమవారం తెల్లవారుఝూమున కురిసిన భారీ వర్షానికి ఉల్లి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
50 ఎకరాల్లో నీట మునిగిన ఉల్లి పంట
అవుకు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రమల కొండల్లో సోమవారం తెల్లవారుఝూమున కురిసిన భారీ వర్షానికి ఉల్లి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎర్రమల కొండల్లోని గ్రామాలైన కొండమనాయునిపల్లె, జూనూతల, ఉప్పలపాడు, కునుకుంట్లలో దాదాపు 500 ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారు. ఉల్లి పంట సాగు కోసం ఎకరాకు రూ. 45 వేలు ఖర్చు చేశారు. పంట కోత దశకు రావటంతో ఉల్లి పంటను పీకి పొలాల్లోనే ఉంచారు. రాత్రి భారీ వర్షం పడంటంతో పొలాల్లోకి నీరు భారీగా చేరి దాదాపు 50 ఎకరాల్లో పంట మునిగిపోయింది. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి కన్నెర్ర చేయటంతో పంట సాగు కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.