Share News

సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM

శ్రీశైలం జలాశయంలో 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఒక్కో గేటు 10అడుగుల ఎత్తుకు తెరిచారు.

సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

శ్రీశైలం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఒక్కో గేటు 10అడుగుల ఎత్తుకు తెరిచారు. స్పిల్‌వే గుండా 2,76,160 క్యూసెక్కులు దిగువ సాగర్‌కు వి డుదల చేశారు. ఎగువ జూరాల గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీ నుంచి మొత్తం 2,86,325 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శుక్రవారం సా యంత్రం 6 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 884 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 210టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్‌ కేం ద్రాలు ఉత్పత్తి అనంతరం 65,784 క్యూసెక్కులు విడుదల చేశారు.

Updated Date - Oct 03 , 2025 | 11:49 PM