శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:13 PM
శ్రీశైలం జలా శయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను ఇంజనీర్లు మూసివేశారు.
నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు
శ్రీశైలం, అక్టోబరు 6,(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలా శయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను ఇంజనీర్లు మూసివేశారు. సోమవారం మళ్లీ వరద ఉధృతి పెరగడంతో మరోమారు 1 క్రస్ట్‌గేటును 10 అడుగుల మేర ఎత్తి 28,075 క్యూసెక్కులు సాగర్‌కు వదిలారు. డ్యాం నీటిమట్టం 885 అడుగులుగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ జూరాల స్పిల్‌వే, విద్యుత్ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీల నుంచి 1,19,613 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తరువాత 62,645 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు రెండు జలవిధ్యుత్ కేంద్రాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 32.209 మిలి యన్ యూనిట్లు ఉత్పత్తి చేసి జెన్-కో అధికారులు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.