Share News

గురుకులంలో వంద శాతం మార్కులు రావాలి

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:30 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలల పదో తరగతి విద్యార్థినిలకు ఉత్తమ విద్య బోధించి, వంద శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దరెడ్డి అన్నారు.

గురుకులంలో వంద శాతం మార్కులు రావాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో జనార్దనరెడ్డి

డీఈవో జనార్దన్‌రెడ్డి

కోవెలకుంట్ల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలల పదో తరగతి విద్యార్థినిలకు ఉత్తమ విద్య బోధించి, వంద శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దరెడ్డి అన్నారు. మంగళవారం మం డల పరిధిలోని రేవనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కోవెలకుంట్ల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జనవరి 26న వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్ద్థులకు బహుమతులు అందించేందుకు ప్రస్తుతం పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహి స్తామన్నారు. పోటీల్లో మం డలం నుంచి అంచెల వారీగా రాష్ట్రస్థాయికి ఎంపికైన వారికి బహు మ తులు ఇస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదు వుకుంటున్న విద్యార్థినిలను ఉపాధ్యాయులు కన్నబిడ్డల్లా చూసు కోవాలని సూచించారు. అనంతరం డిప్యూటీ డీఈవో వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా మండల పరిషత్‌ మోడల్‌ పాఠశాలలో విద్యార్థులకు ఒక్కో మొక్క అందించి పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటసుబ్బయ్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సౌభాగ్యలక్ష్మి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:30 PM