Share News

ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:11 AM

అర్ధరాత్రి వాహనాలను టార్గెట్‌ చేసి రాబరీకి పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను ఆలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్‌
అరెస్టు చూపుతున్న సీఐ రవిశంకర్‌రెడ్డి

ఆలూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వాహనాలను టార్గెట్‌ చేసి రాబరీకి పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను ఆలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన మేరకు.. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి పట్టణంలోని అతిథి హోటల్‌ వద్ద జాతీయ రహదారిపై లారీని ఆపుకుని నిద్రిస్తున్న డ్రైవర్‌ నుంచి మొబైల్‌, డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించగా డ్రైవర్‌ ప్రతిఘటించడంతో చాకుతో దాడిచేసి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోపిడీ కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆదేశాల మేరకు సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేశారు. కర్ణాటకలోని చిక్కవద్దట్టి గ్రామం, గదగ్‌ జిల్లాకు చెందిన షికారి ప్రేమేష్‌, బళ్లారి జిల్లా బసరకోడూరు గ్రామానికి చెందిన మూర్తి అనే ఇద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బు, సెల్‌ఫోన్‌లు దొంగతనాలు చేస్తూ రాత్రిపూట రోడ్డు పక్కన నిద్రించే లారీ డ్రైవర్లను టార్గెట్‌ చేస్తూ కత్తులు, రాళ్లతో దాడి చేసి దోచుకునేవారు. గతంలో కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. కర్నూలు నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారన్నారు. ఆదోని మూడో పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు సంబంధించి మూడు చోరీ కేసుల్లో కూడా వీరు ముద్దాయిగా విచారణలో తేలిందన్నారు. కడప, ఆదోని సెంట్రల్‌ జైలులో శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. ఈ కేసును చేధించిన ఆలూరు ఎస్‌ఐ మహబూబ్‌బాషా, ఏఎ్‌సఐ చంద్రశేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రంగయ్య, కానిస్టేబుల్‌ కె.పరశురాం, సుధాకర్‌, వీరాంజి, రమే్‌షను సీఐ అభినందించారు.

Updated Date - Sep 19 , 2025 | 12:11 AM