Share News

ఉల్లి రైతు కన్నీరు

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:29 AM

ఉల్లి ధర పతనం కావడంతో రైతు కన్నీరు పెడుతున్నాడు. ప్రారం భంలో ఉన్న ధర దిగుబడి వచ్చిన అనంతరం పతనం కావడంతో రైతుకు దిక్కు తోచడం లేదు

ఉల్లి రైతు  కన్నీరు
రోడ్డుపై ఆరబెట్టిన ఉల్లిగడ్డలు

ధర పతనంలో రైతు కుదేలు

పెట్టుబడి కూడా రాదని ఆవేదన

దేవనకొండ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర పతనం కావడంతో రైతు కన్నీరు పెడుతున్నాడు. ప్రారం భంలో ఉన్న ధర దిగుబడి వచ్చిన అనంతరం పతనం కావడంతో రైతుకు దిక్కు తోచడం లేదు. మండలంలోని అలారుదిన్నె, తెర్నేకల్‌, కప్పట్రాళ్ల, మాచాపురం, పి.కోటకొండ, దేవనకొండ, పుల్లాపురం గ్రామాల్లో 3 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగు చేశారు. తీరా దిగుబడి చేతికందే సమయంలో ధర పతనం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి..

ఉల్లి నారు నుంచి, సస్స రక్షణ చర్యలు, పురుగు మందుల నివారణకు, దిగుబడి కోసేందుకు ఎకరాకు దాదాపు రూ.లక్ష అవుతోందని రైతులు అంటు న్నారు. గ్రేడింగ్‌ చేయడం, మార్కెట్‌కు తరలించడానికి ఖర్చులు అధికమవుతున్నా యని ఆవేదన చెందుతున్నారు.

ధర పతనం..

ఉల్లి దిగుబడి చేతికందిన సమయంలో ధర పతనం కావడంతో రైతులు దిగాలు పడుతున్నారు. కిలో రూ.12ల ప్రకారం, క్వింటం రూ.1,200లుగా ధర చెల్లిస్తుం డటంతో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర ప్రకారం తమకు పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు.

మూడెకరాల్లో సాగు చేశా

మూడెరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. ధర పతనం కావడంతో పెట్టుబడి కుడా దక్కని పరిస్థితి. పెట్టుబడుల భారం పెరగడంతో రూ.3 లక్షల నష్టం వస్తుంది. - సోమన్న, రైతు, పుల్లాపురం

పంట నమోదు రసీదు తీసుకెళ్లాలి.

రైతులు కర్నూలు మార్కెట్లో దిగుబడిని విక్రయిం చేందుకు వేళ్లేముందు స్థానిక రైతుసేవా కేంద్రంలో పంట నమోదు రసీదు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌, బ్యాంకు ఖాతా జిరాక్సు తీసుకెళ్లాలి. మార్కెట్‌ యార్డు, మార్కెఫెడ్‌ ద్వారా కలుగోలు చేస్తారు. - నాగ సునీల్‌ కుమార్‌, ఉద్యాన విస్తీర్ణ అధికారి, దేవనకొండ.

Updated Date - Sep 01 , 2025 | 12:29 AM