అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:39 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ. సిరి ఆదేశించారు.
కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ. సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 27వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులకు గుండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్‌ఈని ఆదేశించారు. వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లలు, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరినట్లయితే వెంటనే అద్దె భవనంలోకి వెళ్లే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లు తనిఖీచేయని సచివాలయ సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, పాల్గొన్నారు.