Share News

దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పణ

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:42 AM

దసరా దేవీ శరన్నవరా త్రుల ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రా మంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు.

దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పణ
దుర్గాదేవికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి

బేతంచెర్ల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దసరా దేవీ శరన్నవరా త్రుల ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రా మంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే కోట్ల మేళ తాళాల మధ్య ఊరేగింపుతో వెళ్లి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమ ర్పించారు. అలాగే పట్టణంలోని గౌరిపేటలో ఉన్న ఆంజనేయ స్వామికి, వేంకటేశ్వరస్వామికి, వాసవి కన్యకా పరమేశ్వరీదేవికి ఎమ్మెల్యే కోట్ల దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండా గోపాల్‌, బచ్చు సుబ్రహ్మణ్యం, అశ్వర్థ నారాయణ, ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం మండ లంలోని హుశేనాపురం గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో జమ్ములమ్మ, గంగమ్మ దేవత లను 40 రోజుల చల్లదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి కూడా ఎమ్మెల్యే కోట్ల పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగ య్య, నాయకురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, మండల సహకార సంఘం సొసైటీ చైర్మన చంద్రశేఖర్‌, టీడీపీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, అంబాపురం సర్పంచ శ్రీనివాసులు, బుగ్గన బ్రహ్మానందరెడ్డి, భీమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:42 AM