Share News

కాణిపాక వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:13 PM

కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం తరపున మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

కాణిపాక వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ
పట్టు వస్త్రాలను తీసుకొస్తున్న శ్రీశైల దేవస్థానం అధికారులకు స్వాగతం పలుకుతున్న కాణిపాకం ఆలయ సిబ్బంది

నంద్యాల కల్చరల్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం తరపున మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైల దేవస్థానం తరపును పట్టువస్త్రాలను సమరిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గతనెల 27న ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు ఈనెల 16వ తేదీతో ముగియనున్నట్లు తెలిపారు. కాణిపాక ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్‌, అర్చకులు, వేదపండితులు శ్రీశైల దేవస్థానం అధికారులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సంప్రదాయ బద్దంగా మేళతాళాలతో స్వయంభు వరసిద్ధి వినాయకస్వామికి శ్రీశైల దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చకులను కాణిపాక ఆలయ కార్యనిర్వహణధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశ్వీరచనముతో సత్కరించారు.

Updated Date - Sep 02 , 2025 | 11:13 PM