శ్రీశైలంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:23 AM
శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి డ్యాం వరకు ఆయా పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో శనివారం రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించింది.
నంద్యాల కల్చరల్(శ్రీశైలం), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి డ్యాం వరకు ఆయా పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో శనివారం రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించింది. రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం డ్యామ్‌పై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఆక్టోపస్ ఏపీ మంగళగిరి డీఎస్పీ రంగబాబు ఆధ్వర్యంలో 38 మంది ఆక్టోపస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కొండలు, గుట్టలు దిగుతూ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్‌డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చీకటి, నిశబ్దమైన వాతావరణం నెలకొంది.