ఉద్యాన పంటల పరిశీలన
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:06 AM
మండలంలోని ఎంబాయి, సీతారామపురం గ్రామాల్లోని ఉద్యాన పంటలను కలెక్టర్ జి.రాజకుమారి మంగళవారం పరిశీలించారు.
బేతంచెర్ల, సెప్టెంబరు 23(ఆంద్రజ్యోతి): మండలంలోని ఎంబాయి, సీతారామపురం గ్రామాల్లోని ఉద్యాన పంటలను కలెక్టర్ జి.రాజకుమారి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఉల్లి రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. పంటల దిగుబడి లాభ, నష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రీడ్ విత్తనాలను వేయాలని రైతులకు సూచించారు. డ్రిప్ ఇరిగే షనతో మంచి నాణ్యమైన పంటలను పండించవచ్చని, కలుపు నివార ణకు మల్చింగ్ విధానంలో పంటలను సాగు చేయవచ్చని సూచించారు. ఎంబాయి గ్రామంలో సాగు చేస్తున్న అరటి, మామిడి తోటలను పరిశీలించారు. సీతారామపురం గ్రామంలో రైతు పాలెం యుగంధర్‌రెడ్డి వేసిన షేడ్ నట్ నర్సరీని సందర్శించారు. ఈ నర్సరీ ద్వారా అరటి, మిరప, చామంతి మొక్కలను రైతులకు అందించి ఆదా యం పొందు తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఉద్యాన శాఖాధి కారులు ఉన్నారు.