Share News

నర్సింగ్‌ సిబ్బంది పనితీరు మారాల్సిందే

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:47 AM

వార్డులో నర్సింగ్‌ సిబ్బంది రోగుల దగ్గరకు వెళ్లడం లేదని, ఇకనైనా వారు తమ పనితీరును మార్చుకోవాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటే శ్వర్లు సూచించారు.

నర్సింగ్‌ సిబ్బంది పనితీరు మారాల్సిందే
హెడ్‌ నర్సులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

ఇక నుంచి నర్సింగ్‌ కేర్‌పై తనిఖీలు

జీజీహెచ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వార్డులో నర్సింగ్‌ సిబ్బంది రోగుల దగ్గరకు వెళ్లడం లేదని, ఇకనైనా వారు తమ పనితీరును మార్చుకోవాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటే శ్వర్లు సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మంగళవార హెడ్‌ నర్సులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో హెడ్‌ నర్సులు సరిగ్గా పర్య వేక్షణ చేయడం లేదన్నారు. ఇక నుంచి నర్సిం గ్‌ కేర్‌పై వారంలో రెండు రోజులు డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సావిత్రీబాయి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల న్నారు. అసలు వార్డులో రోగుల దగ్గరకు నర్సింగ్‌ సిబ్బంది వెళ్లడం లేదని, చెబుతూ సీసీ కెమెరాలో ఏఎంసీ వార్డును సూపరింటెండెంట్‌ అందరికీ చూపించారు. అందులో నర్సింగ్‌ సిబ్బంది ఎక్కడా కూడా కనబడటం లేద ని, కేవలం హౌస్‌ సర్జన్లు మాత్రమే ఉంటారన్నారు. నర్సింగ్‌ కేర్‌ బాగుంటే రోగులు 75 శాతం సంతృప్తి చెందుతారన్నారు. సమీక్షలో డిప్యూటీ సూప రింటెండెట్‌ శ్రీరాములు, సీఎస్‌ఆర్‌ఎంవో వెంకటరమణ, హాస్పిటల్‌ అడ్మిని స్ర్టేటర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, హెడ్‌నర్సులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:47 AM