Share News

ఎన్టీఆర్‌ వైద్యసేవ కేసులు పెంచండి

ABN , Publish Date - Nov 06 , 2025 | 01:14 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద కేసులన్నింటిని ప్రీ అథరైజ్‌ చేయాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కర్నూలు మెడికల్‌ కాలేజీ కాన్ఫరెన్స్‌ హాల్లో జీజీహెచ్‌, మెడికల్‌ కాలేజీ వైద్యులతో సమీక్ష నిర్వహించారు.

ఎన్టీఆర్‌ వైద్యసేవ కేసులు పెంచండి
మెడికల్‌ కాలేజీలో వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

బోధనాసుపత్రి సమస్యలను పరిష్కరిస్తాం : కలెక్టర్‌

కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్యులతో సమీక్ష

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద కేసులన్నింటిని ప్రీ అథరైజ్‌ చేయాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కర్నూలు మెడికల్‌ కాలేజీ కాన్ఫరెన్స్‌ హాల్లో జీజీహెచ్‌, మెడికల్‌ కాలేజీ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద 250 మంది రోగులుంటే 150 మంది రోగుల వివరాలు మాత్రమే డాక్యుమెంటేష్‌ చేస్తున్నారపి, 75 మంది సిబ్బందితో కేసుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తెలంగాణ కేసులు ఉంటాయనీ, అవి పరిగణలోకి రావని వివరించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఆపరేషన్లు నిర్వహిస్తున్న జనరల్‌ సర్జరీ విభాగాన్ని కలెక్టర్‌ అభినందించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద అవసరమైతే బయట నుంచి మత్తుమందు వైద్యులను రప్పించుకునే అవకాశాన్ని కలెక్టర్‌ కల్పించారు. అత్యవసర సర్జరీ కేసులకు రేడీయాలజి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాత్రి సమయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కొందరు వైద్యులు కలెక్టర్‌కు విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ 24 గంటలు ఒక రేడియాలజిస్టు డ్యూటీలో ఉండాలని ఆదేశించారు. అనస్తీషియా విభాగాన్ని ఇతర విభాగాల మాదిరిగా ఆరు యూనిట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాన్సర్‌ ఆసుపత్రి ఆపరేషన్‌ థియేటర్లను ఇంకా పూర్తి చేయకపోవడంపై కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సత్యనారాయణ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.సాయిసుదీర్‌, డా.హరి చరణ్‌ హెచ్‌వోడీలు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు

Updated Date - Nov 06 , 2025 | 01:14 AM