ఇక ఉన్నత పాఠశాలగా..
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:57 PM
మండలంలోని హంప ప్రభుత్వ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పటిదాకా 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వరకు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
హంప గ్రామం ఎంపీపీ పాఠశాలను జడ్పీ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం
మద్దికెర, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హంప ప్రభుత్వ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పటిదాకా 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి వరకు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు 3వేల మంది ఉన్నారు నివసిస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేసి, 1 నుంచి 8వ తరగతి వరకు ఏర్పాటు చేసింది. పాఠశాలలో 153 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలగా మార్పు చేశారు. ఉపాధ్యాయులను పదోన్నతి ద్వారా భర్తీ చేయనున్నారు. దీంతో సమీపంలోని గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరే అవకాశముంది. హంప గ్రామంతో, సమీప గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.