మధ్యవర్తిత్వంతో సమయం వృథా కాదు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:55 PM
మధ్యవర్తిత్వం ప్రక్రియ ద్వారా సమయం వృథా కాదని మండల లీగల్‌సెల్ చైర్మన్, నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా అన్నారు.
జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా
నంద్యాల క్రైం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ప్రక్రియ ద్వారా సమయం వృథా కాదని మండల లీగల్‌సెల్ చైర్మన్, నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా అన్నారు. మంగళవారం కోర్టు భవనంలో నిర్వహించిన మీడియేషన్ ఫర్ ద నేషన్ కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల సామరస్య పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆయా సంస్థల సివిల్ కాంపౌండ్, క్రిమినల్ కేసులు, రాజీపడదగ్గ ఇతర కేసులకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 10నుంచి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, సాయిస్వరూ్‌ప మధ్యవర్తిత్వంపై ప్రింట్, ఎలకా్ట్రనిక్ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత ఆయా కోర్టుల న్యాయాధికారుల ఆధ్వర్యంలో అవార్డు ఇస్తామని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియాకు చెందిన ద్వారకానాథ్, నరసింహులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు 1కే వాక్ ర్యాలీ
మండల లీగల్‌సెల్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వన్ నేషన్-మీడియేషన్ కార్యక్రమంపై వన్‌కే వాక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మీడియేషన్ ప్రతినిధులు వెదుర్ల రామచంద్రరావు, సాయిస్వరూప్ తెలిపారు. ఈకార్యక్రమంలో న్యాయాధికారులు, న్యాయవాదులు, ఎన్జీవోస్, స్టేట్‌హోల్డర్స్, స్వచ్ఛం ద సంస్థలు ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.