మూఢ నమ్మకాలు వద్దు
ABN , Publish Date - May 30 , 2025 | 11:32 PM
మూఢ నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిదని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్ కుమార్ అన్నారు.
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్
కర్నూలు హాస్పిటల్, మే 30 (ఆంధ్రజ్యోతి): మూఢ నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిదని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్ కుమార్ అన్నారు. నగరంలోని బిర్లా కాంపౌండ్ వద్ద శుక్రవారం జన విజ్ఞాన వేదిక 3 రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, మూఢ నమ్మకాల లాంటి అంశాలపై జేవీవీ పని చేస్తోందన్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే అన్ని జిల్లాలో జేవీవీ తరపున అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. జేవీవీ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ బ్రహ్మా రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు మహ్మద్ మియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు కృష్ణోజి, రమణయ్య, కోటేశ్వరరావు, శ్రీను, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.