విద్యాసంస్థల వద్ద గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదు
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:24 AM
పాఠశా లలు, కళాశాలల వద్ద గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని డీఎస్పీ హేమలత హెచ్చరిం చారు.
డీఎస్పీ హేమలత
ఆదోని, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పాఠశా లలు, కళాశాలల వద్ద గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని డీఎస్పీ హేమలత హెచ్చరిం చారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా మంగళవారం పోలీసులు పట్టణం లోని పాఠశాల, కళాశాల సమీ పంలో గుట్కా లు, సిగరెట్లు అమ్ము తున్న దుకాణాలపై దాడులు చేసి, సరుకును సీజ్ చేశారు. యజమా నులకు జరిమానాలు విధించారు. డీఎస్పీ మాట్లాడుతూ కళాశాల, పాఠశాలకు కనీసం వంద మీటర్ల దూరం వరకు వీటిని వక్రయించ కూడదని, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు పలు షాపుల్లో దాడులు నిర్వహించామని, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.