Share News

మహిళలంటే జగన్‌కు గౌరవం లేదు

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:17 AM

మహిళలపై మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట విశ్వేశ్యరయ్య సర్కిల్‌లో మహిళలు నిరసన తెలిపారు.

మహిళలంటే జగన్‌కు గౌరవం లేదు
ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీడీపీ మహిళలు

ఆగ్రహం వ్యక్తం చేసిన ‘తెలుగు మహిళ’

విశ్వేశ్వరయ్య సర్కిల్‌లో మహిళల నిరసన

కర్నూలు అర ్బన్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మహిళలపై మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట విశ్వేశ్యరయ్య సర్కిల్‌లో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా ప్రసారం చేసిన సాక్షి టీవీ డిబేట్‌లను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి మహిళలపై సొంత మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన విషయంపై జగన్‌ ఇంత వరకు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ఆ వాఖ్యను తప్పుబడుతుంటే జగన్‌ మాత్రం వ్యాఖ్యలకు మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. కొమ్మినేనికి సుప్రీంకోర్టు ఇచ్చింది కండిషన్‌ బెయిల్‌ మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికైనా జగన్‌ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కరపత్రాలను రహదారిపై దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ రమణమ్మ, తెలుగు మహిళలు మారుతిశర్మ, శాంతమ్మ, రాధమ్మ, రేష్మ, అయాత్‌, జనసేన నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:17 AM