Share News

వానా.. నీ జాడ ఎక్కడ?

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:29 AM

ముందస్తు వర్షాలు కురియడంతో రైతులు ఆనం దపడ్డారు. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలలోనే రావడంతో రైతులు ఖరీఫ్‌ సాగు మొదలు పెట్టారు.

వానా.. నీ జాడ ఎక్కడ?
నందికొట్కూరు- అల్లూరు మార్గంలో ఎండుతున్న మొక్కజొన్నపైరు

ముందస్తు వర్షాలతో పంటలను సాగుచేసిన రైతులు

ముఖం చాటేసిన రుతుపవనాలు

ఎండుతున్న పంటలు

నందికొట్కూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ముందస్తు వర్షాలు కురియడంతో రైతులు ఆనం దపడ్డారు. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలలోనే రావడంతో రైతులు ఖరీఫ్‌ సాగు మొదలు పెట్టారు. తీరా వర్షాలు కురకవపోవడంతో పంటలు ఎండుతు న్నాయి. నియోజకవర్గంలో మొక్కజొన్న, పత్తి సాగు చేశారు. విత్తనం వేసి 15 రోజులు అవుతున్నా చినుకు జాడ లేదు. దీంతో మొక్కజొన్న, పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. దీనికితోడు వేడిగాలులు వీస్తుండటంతో మొక్కలు ఎండుతున్నాయి. మరో రెండు రోజుల్లో వర్షం కురవకపోతే మొక్కజొన్నను దున్నేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

మొక్కజొన్న సాగు ఖర్చు(ఎకరాకు)

సేద్యం : 6,000

విత్తనాలు: 5,400(మూడు ప్యాకెట్లు)

కూలీలు: 3,000

కలుపు నివారణ: 1,500

ఎరువులు, పురుగుమందులు : 10,000

కోత, నూర్పిడి: రూ.5,000

పెరిగిన పెట్టుబడి..

ఏటా పెట్టుబడి పెరిగిపోవడంతో రైతుకు తలకు మించిన భారంగా మారింది. విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు తడిసి మోపెడవు తున్నాయి. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ జమ చేస్తున్నా అవి సరిపోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, తీరా దిగుబడి అంతంత మాత్రంగానే వస్తుండటంతో నష్టపోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:31 AM