నాణ్యత నగుబాటు
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:50 AM
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ..1.30 కోట్లను మంజూరు చేసింది. మూడు డార్మెంటరీ గదులు, మూడు రెసిడెన్సియల్ గదులతో పాటు టాయిలెట్లను నిర్మిస్తున్నారు.
రెండడుగుల్లోనే పునాదులు
‘కస్తూర్బా’లో ఇష్టారాజ్యంగా తరగతి గదుల నిర్మాణం
రూ.1.30 కోట్లతో నిర్మాణం
హొళగుంద, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ..1.30 కోట్లను మంజూరు చేసింది. మూడు డార్మెంటరీ గదులు, మూడు రెసిడెన్సియల్ గదులతో పాటు టాయిలెట్లను నిర్మిస్తున్నారు.
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
పనులను దక్కించుకున్న కాంట్రా క్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 6 అడుగులకు పైగా లోతులో తీయాల్సిన పునాదులను కేవలం 2 అడుగుల మేరకు తీసి, సిమెంట్ బెడ్ వేసి, పిల్లర్లు నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి వాడిన 20ఎమ్‌ఎమ్ కంకర, స్టీలు సైతం నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
భవన నిర్మాణానికి 20 చెట్లు నరికివేత
తరగతి గదుల నిర్మాణానికి ఆవరణలో వున్న దాదాపు 20 చెట్లను నరికివేసినట్లు విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు మొక్కలను పెంచేందుకు రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తుంటే, కాంట్రాక్టర్ ఇలా చెట్లను నరికివేయడం విచారకరం.
ఈ విషయపై ఎస్‌ఎస్‌ఏ ఏఈ ఖాజా మొయినుద్దీన్‌ను వివరణ కోరగా కళాశాల నిర్మాణ పనులు నాణ్యతతో నిర్మిస్తున్నా మని పునాదులు తవ్వుతుండగా రాళ్లు పడటంతో 40 ఎమ్‌ఎమ్ కంకరతో బెడ్ వేశామన్నారు.