Share News

తాగు, సాగు నీటికి ఇబ్బందులుండవు

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:24 AM

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ద్వారా సముద్రంలో కలిసే నీటిలో కొంత బాగాన్ని పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు మళ్లిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.

తాగు, సాగు నీటికి ఇబ్బందులుండవు
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

భూగర్భజలాలు పెరుగుతాయి

గైర్హాజరైన అధికారులకు నోటీసులివ్వండి

జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి

ముగిసిన జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ద్వారా సముద్రంలో కలిసే నీటిలో కొంత బాగాన్ని పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు మళ్లిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం జడ్పీ మినీ సమావేశ భవనంలో ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. చైర్మన్‌ అధ్యక్షత వహించగా డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షించారు.

చైర్మన్‌ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు నుంచి వరద నీటిని విడుదల చేస్తే జిల్లాలోని వెలుగోడు, గోరుకల్లు, అవుకు, రిజార్వయర్లను నింపుకోవడంతో పాటు కాలువల్లో నిరంతర ప్రవా హం ఉంటే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ఈదిశగా నీటి పా రుదల శాఖకు చెందిన ఇంజనీర్లు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది జూన్‌ 22నాటికి శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉం డిందని, పోతిరెడ్డి పాడు ద్వారా నీటి ని విడుదల చేసి ఉంటే కనీసం బోర్లు రీచార్జ్‌ అయ్యేవన్నారు. శ్రీశైలం నీటి విడుదల మన చేతిలో లేదని, దీనికి తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు అనుమతులు కావాలని సంబంధిత పర్యవేక్షక ఇంజనీరు ప్రతాప్‌ వివరించారు. జడ్పీటీసీలు, సుంకన్న, రంగనాథగౌడు, సుంకన్న ,పోచా జగదీశ్వరరెడ్డి, , ఉమ్మడి జిల్లాల అధకారులు పాల్గొన్నారు.

పీఆర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

జడ్పీ నిధులతో నిర్ణీత సమయంలో చేపట్టాల్సిన పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి రూ.2.50 కోట నిధు లు ల్యాప్స్‌ అయ్యేందుకు కారణమైన పీఆర్‌ ఇంజనీర్లపై చర్యలు తీసుకునేందుకు పీఆర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. ఈప నులను ఈఏడాది సెప్టెంబరు ఆఖరికి పూర్తిచేయకుంటే నిదులు ల్యాప్స్‌ అయ్యే ప్రమాదముందని ప్రతి నెలా పీఆర్‌ ఇంజనీర్లను హెచ్చరిస్తూనే ఉన్నా మన్నారు. అయినా పనుల్లో జరిగిన జాప్యంతో రూ.2.50కోట్ల నిధులు ల్యాప్స్‌ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండా...

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలలకు ప్రభుత్వ శాఖల అధికారు లు తరచూ గైర్హాజరు కావడంపై జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, ఆదోని ఎ మ్మెల్యే పార్థసారథి అసహనం వ్యక్తంచేశారు. సహేతుకమైన కారణం లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలకు గైర్హాజర య్యే అధికారులకు నోటీసులు జారీ చేయాలని పాపిరెడ్డి డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డిని ఆదేశించారు.

జోరుగా అవినీతి, అక్రమాలు

ఉపాధి హమీ పథకం పనుల్లో క్షేత్రస్థాయిలో అవీనతి అక్రమాలు జోరుగా జరు గుతున్నాయని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. గృహనిర్మాణాల ఫ్లెక్సీలు పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని, ఇసుక రీచుల్లో వంద శాతం వాహనాల్లో గృహనిర్మాణాలకు అంటూ, 70వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:24 AM