Share News

ప్లాస్టిక్‌ వద్దు.. జ్యూట్‌ ముద్దు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:42 PM

ప్లాస్టిక్‌ వినియోగం వద్దని, జ్యూట్‌ బ్యాగుల ను వాడాలని అంగన్వాడీ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి పిలుపునిచ్చారు

ప్లాస్టిక్‌ వద్దు.. జ్యూట్‌ ముద్దు
ప్రతిజ్ఞ చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది

కోడుమూరు రూరల్‌, అక్టోబరు 4, (ఆంధ్ర జ్యోతి): ప్లాస్టిక్‌ వినియోగం వద్దని, జ్యూట్‌ బ్యాగుల ను వాడాలని అంగన్వాడీ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం కృష్ణాపురం గ్రామంలో ప్లాస్టిక్‌ అనర్థాలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌తో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్‌ మట్టిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుందన్నారు. అనంతరం ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యకర్తలు రాధ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:42 PM