Share News

నదిని ఎవరూ దాటొద్దు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:45 AM

భారీ వర్షాల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణ శివార్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశి నదిని సోమవారం తహసీల్దార్‌ రత్నరాధిక, అర్బన సీఐ రాము పరిశీ లిం చారు.

నదిని ఎవరూ దాటొద్దు
భవనాశి నది ఉధృతిని పరిశీలిస్తున్న అధికారులు

‘భవనాశి’ని పరిశీలించిన అధికారులు

ఆత్మకూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణ శివార్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశి నదిని సోమవారం తహసీల్దార్‌ రత్నరాధిక, అర్బన సీఐ రాము పరిశీ లిం చారు. వరద ఉధృతి తగ్గేవరకు భవనాశి నదిని ఎవరూ దాటవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా భవనాశి ఉప్పొంగంతో ఆత్మ కూరు నుంచి కురుకుంద, కొట్టాలచెరువు గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వరద తగ్గుముఖం పట్టేవరకు ఆ రహదారిని ఎవ రిని అనుమతించడం లేదు. ఇందుకోసం నదికి ఇరువైపులా పోలీసు, రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే సిద్దాపురం చెరువులోకి కూడా భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో సిద్దాపురం చెరువును కూడా అధికారులు పరిశీలించారు. దీంతో కర్నూలు - గుంటూరు రహదారి పక్కనే ఉన్న అలుగు వద్ద నుంచి చెరువులో నీరు బయటకు వస్తుండటంతో ఆ నీటి వల్ల కేజీరోడ్డున వెళ్లే వాహ నాలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు జాగ్ర త్తలతో వాహనాలు కొట్టుకునిపోయేందుకు వీలు లేకుండా కంచెను ఏర్పాటు చేస్తున్నారు. చెరువు పరిసర గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. కాగా సిద్దాపురం చెరువులో గరిష్టస్థాయిలో నీటి నిల్వలు వచ్చిచేరడంతో వద్ద టీడీపీ నాయకులు రవీంద్రబాబు, శివ ప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, వెన్నాశ్రీధర్‌రెడ్డి, స్వామిరెడ్డి, ఈశ్వర రెడ్డి తదితరులు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Aug 19 , 2025 | 12:45 AM