ఎవరికీ సంతోషం లేదు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:25 PM
కూటమి పాలన వల్ల రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి జీ.ఈశ్వరయ్య విమర్శించారు.
ప్రజా వ్యతిరేకంగా మారిన కూటమి పాలన
పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
కర్నూలు న్యూసిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కూటమి పాలన వల్ల రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి జీ.ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం సీఆర్ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కే. రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి. రామచంద్రయ్యతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికా రం రాకముందు ఒక మాట, వచ్చిన తరువాత ఒక మాట మాట్లా డుతూ ప్రజా వ్యతిరేకంగా తయారైందని అన్నారు. అధికారంలోకి వచ్చి న తరువాత ఎన్ని పరిశ్రమలు స్థాపించిందీ, ఎంత ఉత్పత్తి పెంచిందీ చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూ బ్యాంక్ పేరుతో నియోజకవర్గానికి లక్ష ఎకరాలు గుర్తించి రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టడం సరికాదని అన్నారు. చంద్రబాబు మోదీని పొడిగితే.. మోదీ లోకేష్‌ను పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమలో సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, ఎన్. లెనిన్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కే.జగన్నాథం, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.