Share News

మారని అధికారుల తీరు

ABN , Publish Date - May 20 , 2025 | 12:41 AM

ప్రజల సమస్యలను పరిష్కార వేదికకు కొందరు అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండటంతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు.

మారని అధికారుల తీరు

హొళగుందలో ఎంపీడీవో మాత్రమే ఉన్నారు

హొళగుంద, మే19 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కార వేదికకు కొందరు అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండటంతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. సోమవారం హొళగుందలో నిర్వహిచిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 16 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొనాల్సి ఉండగా ఎంపీడీవో విజయలలిత మాత్రమే పాల్గొన్నారు. కొందరు అధికారులు సంతకాలు చేసి వెళ్లిపోగా, మరికొందరు పత్తాలేరు. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయలలితను వివరణ కోరగా వివిధ శాఖలకు చెందిన అధికారులు కొందరు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోయారని తెలిపారు.

తుగ్గలి: ప్రజా పరిష్కార వేదికకు హాజరుకావలసిన అన్ని శాఖల అధికారులు పత్తాలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సోమవారం తుగ్గలిలో తహసీల్దార్‌, కొందరు వీఆర్వోలు తప్ప ఎవరూ కనిపించలేదు. దీంతో ప్రజలు, రైతులు తహసీల్దార్‌ రమాదేవికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు.

Updated Date - May 20 , 2025 | 12:41 AM