Share News

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 13 , 2025 | 12:37 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రిసెల్‌ సిస్టమ్‌ పీజీఆర్‌ఎస్‌) నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌

వినతులు స్వీకరించిన సబ్‌ కలెక్టర్‌

ఆదోని, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రిసెల్‌ సిస్టమ్‌ పీజీఆర్‌ఎస్‌) నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు సమస్యలను పంపి, గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, డీఎల్‌డీవో రమణ రెడ్డి, డీఎల్పీవో నూర్జహాన్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పద్మజ, ఆర్టీసీ డీఎం మహ్మద్‌ రఫీ, డీటీ వలిబాషా, గుండాల నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:37 AM