Share News

అక్రమ లే అవుట్లు

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:28 PM

నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు.

అక్రమ లే అవుట్లు
బీటీ రోడ్డు తొలగింపు

అనుమతి లేకుండానే వెంచర్లు వేస్తున్న ‘రియల్‌’ వ్యాపారులు

ప్లాట్లు కొని మోసపోతున్న కొనుగోలుదారులు

అక్రమ వెంచర్లను ధ్వంసం చేసిన కుడా అధికారులు

ఆదోని, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు.

ఇష్టానుసారంగా వెంచర్లు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 5,6 ఎకరాలు కొనుగోలు చేసి ల్యాండ్‌ కన్వర్షన్‌, కుడా అనుమతి తీసుకోకుండానే ప్లాట్లు వేసి, రాళ్లు పాతుతున్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నా గ్రామ పంచాయతీ వారు కాని, మున్సిపాలిటీ అధికారులు కాని అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

అడపా డదడపా దాడులు

అక్రమ వెంచర్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు వెంచర్ల వద్దకు వెళ్లి హంగామా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు అందిన తర్వాత హద్దురాళ్లు తొలగిండం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడ లేదు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుంతో పోతోంది.

ఇవీ నిబంధనలు..

వెంచర్లు వేసే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పించాలి. ముందుగా నిర్ణీత రుసుంను చలానా కట్టి ఆర్డీవోకు దరఖాస్తు చేయాలి. ల్యాండ్‌ కన్వర్షన్‌ పొందాక 30 ఫీట్ల రోడ్లను నిర్మించాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని సిమెంట్‌ కాంక్రీట్‌తో నిర్మించాలి. విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేసి, వాటికి కనెక్షన్లు ఇవ్వాలని అలాగే తాగునీటి సౌకర్యం కల్పించాలి. సామాజిక అవసరాల మేరకు వెంచర్‌లో 10శాతం స్థలాన్ని పంచాయతీ, మున్సిపాలిటీకి అప్పగించి, సదరు స్థలాన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల పేరిట రిజిస్రేషన్‌ చేయించాలి. అనంతరం అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. సంబంధిత అధికారులు అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు.

మోసపోతున్న కొనుగోలుదారులు

అనుమతులు పొందకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా వెంచర్లు వేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఇవేవీ తెలియని కొనుగోలుదారులు ప్లాట్లు కొని మోసపోతున్నారు. ఈ వెంచర్లలో గృహం నిర్మించుకోవాలంటే అనుమతి తెచ్చుకోవలసి వస్తోంది. లే-అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఫీజును చెల్లించాల్సి ఉం టుంది. ప్లాటు యజమానే భరించాల్సి ఉంటుంది.

అక్రమ లే అవుట్‌ వేస్తే వదిలేది లేదు

అక్రమ లే అవుట్లు వేసే వ్యాపారులను వదిలి పెట్టం. అనుమతి లేకుండా వెంచర్లు వేశారన్న సమాచారంతో ఈనెల 25న అధికారులతో సహా ఆదోని మండలం కె.నాగలాపుం, బైచిగేరి, మం డగిరి, సదాపురం, గోనభావి, విరుపాపురం ఇస్వి, పెద్దహరివాణం, పెద్దతుంబళం, పెసలడంబ, బల్లెకల్‌ గ్రామాల్లో అక్రమ లే అవుట్లను గుర్తించాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకోం. అనుమతి లేకుండా వేసిన లే అవుట్లలో రహదారులను ధ్వసం చేశాం. - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్‌

Updated Date - Apr 27 , 2025 | 11:28 PM