Share News

ఫీడ్‌ బ్యాక్‌ సరిగా లేదు

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:53 AM

అన్న క్యాంటీన్‌లో భోజనం బాగుందంటున్నారి కానీ, ఫీడ్‌ బ్యాక్‌లో మాత్రం బాగాలేదని చెబుతున్నారనీ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు.

ఫీడ్‌ బ్యాక్‌  సరిగా లేదు
భోజనం చేస్తున్న వారితో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్‌లో భోజనం బాగుందంటున్నారి కానీ, ఫీడ్‌ బ్యాక్‌లో మాత్రం బాగాలేదని చెబుతున్నారనీ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అన్న క్యాంటీన్‌ను సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, వంటశాల, పరిశుభ్రత, భోజనం చేసే ప్రాంతం, కుర్చునే సౌకర్యాలు టోకెన్‌ వ్యవస్థను పరిశీలించారు. బోజనం చేస్తున్న ఓ రోగి బందువు మాట్లాడుతూ తనబంధువు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారని అప్పటినుంచి, అన్న క్యాంటీన్‌లోనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తున్నారనీ కలెక్టర్‌కు వివరించారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం లభిస్తోందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌ నిర్వహణలో లోపాలు ఉండకూడదని పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని నిర్వహకులను ఆదేశించారు.

Updated Date - Dec 12 , 2025 | 12:53 AM