Share News

వసతిలేని గృహాలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:28 PM

పట్టణంలోని బీసీ కాలేజ్‌ హాస్టల్‌, బీసీ బాలుర, బాలికల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. ఇరుకు గదులతో విద్యార్థులు అవస్థలు పడు తున్నారు. గ్రామాల విద్యార్థులు ఆలూరులో వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు.

వసతిలేని గృహాలు
అద్దె భవనంలో కొనసాగుతున్న బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్‌.. బీసీ బాలికల కళాశాల విద్యార్థుల హాస్టల్‌

అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో హాస్టళ్లు

ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

ఆలూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బీసీ కాలేజ్‌ హాస్టల్‌, బీసీ బాలుర, బాలికల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. ఇరుకు గదులతో విద్యార్థులు అవస్థలు పడు తున్నారు. గ్రామాల విద్యార్థులు ఆలూరులో వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే వారికి సరిపడ స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. దీంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని, బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతుతున్నారు.

రూ.లక్షల్లో అద్దె

బీసీ బాలుర, కళాశాల హాస్టల్‌తో పాటు బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ఇవి మూడు అద్దె భవనాల్లో ఉండటంతో ఏటా ప్రభుత్వం రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తోంది. బీసీ బాలుర కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.34వేలు, బాలుర హాస్టల్‌కి నెలకు రూ.52, 800లు, బాలికల హాస్టల్‌కు రూ.35 వేలు అద్దె చెల్లిస్తుంది. నెలకు రూ.1,21,800లు కాగా, ఏడాదికి రూ.14,61,600లు చెల్లిస్తోంది. ఈ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉంది.

స్థలాలు కేటాయించారు

ఆలూరు బీసీ బాలు, బాలికల కాలేజీ హాస్టళ్లకు హుళేబీడులో స్థలం కేటాయించారు. బాలుర హాస్టల్‌కు ముద్దనగేరి గ్రామంలో స్థలం కేటాయించారు. అక్కడ భవనాలు నిర్మిస్తే కళాశాల, పాఠశాలకు రావడానికి విద్యా ర్థులు ఇబ్బంది పడే అవకా శముంది. - సంపత్‌, వార్డెన్‌, బాలుర హాస్టల్‌, ఆలూరు.

Updated Date - Mar 13 , 2025 | 11:28 PM