Share News

ఆడపిల్లలపై వివక్ష వద్దు

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:41 PM

ఆడపిల్ల పుట్టిన, మగ పిల్లవాడు పుట్టినా ఇద్దరు సమానమేనని, ఆడపిల్లలపై వివక్ష వద్దని కలెక్టర్‌ సిరి అన్నారు.

ఆడపిల్లలపై వివక్ష వద్దు
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ సిరి

వారిని బాగా చదివించాలి

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్ల పుట్టిన, మగ పిల్లవాడు పుట్టినా ఇద్దరు సమానమేనని, ఆడపిల్లలపై వివక్ష వద్దని కలెక్టర్‌ సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉం దని, వారిని బాగా చదివించాలన్నారు. తాను ప్రస్తు తం కలెక్టర్‌గా ఉన్నాను అంటే దానికి తన తల్లియే కారణమన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ప్రవేశ పెట్టిందన్నారు. పెద్దపాడు చిల్డ్రన్స్‌ హోం చిన్నారులు, శిశు గృహానికి చెం దిన చిన్నారులు ప్రదర్శించిన ఆట పాటలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. గాంధీ వేషం వేసి అందరిని అలరించిన శిశుగృహ చిన్నారని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.శాంతికళ, సీపీవో భారతి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జుబేదాబేగం, అగినెస్ట్‌ సెక్సువల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మాధవీ శ్యామల, జిల్లాల బాలల సంరక్షణ అధికారి టి.శారద, మహిళా పోలీ్‌సస్టేషన్‌ సీఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:42 PM