ఆలూరులో అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:33 AM
ఆలూరులో అభివృద్ధి శూన్యమని, రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గం పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ధ్వజమెత్తారు. గురు వారం హొళగుంద - ఢణాపురంకు ఆర్ అండ్ బీ రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
హొళగుంద-ఢణాపురం రోడ్డుపై వరినాట్లు వేసిన ఎమ్మెల్యే విరుపాక్షి
హొళగుంద, జూలె 3 (ఆంధ్రజ్యోతి): ఆలూరులో అభివృద్ధి శూన్యమని, రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గం పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ధ్వజమెత్తారు. గురు వారం హొళగుంద - ఢణాపురంకు ఆర్ అండ్ బీ రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఆలూరులో వైసీపీ గెలవడంతో కూటమి ప్రభుత్వం అభివృద్ది పనులు చేయకుండా కక్షసాధింపుకు పాల్పడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డబుల్ రోడ్డు మంజూరు చేయగా, కూటమి ప్రభుత్వం టెండర్లను రద్దుచేసిందన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మోదీ నుంచి నిధులు తెస్తానని గొప్పలు చెప్పిన ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి హామీలు ఏమయ్యా యని ఎమ్మెల్యే ప్రశ్నించారు. షఫీ యుల్లా, ఎస్‌కే గిరి, కోగిలతోట శేషప్ప, ఇమ్రాన్, సింధూ వాళం కృష్ణయ్య, పెద్ద హ్యాట శేఖర్, అంబ్రెష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు యూనిఫాం ఎక్కడ?
ఆలూరు: పాఠశాలలు ప్రారంభించి 17 రోజులైనా విద్యార్థులకు యూనిఫాం ఎక్కడ? అని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురు వారం ఆలూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-1ను పరిశీలించారు. పభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉండ టంతో అప్పుడే తెగిపోయాయన్నారు. నాగప్ప, వీరేష్, నాగేంద్ర, నాగేష్, వరుణ్, కురువ రాజు, తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు.