హతవిధీ.. ఇదేం శిక్షణ
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:39 AM
పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణార్థులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వ ఐటీఐ దుస్థితి ఫ పాత షెడ్‌పై కప్పు నుంచి లీక్ అవుతున్న నీరు
ఆలూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణార్థులు అవస్థలు పడుతున్నారు. సొంత భవనం లేకపోవడంతో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని చిన్నపాటి పాత షెడ్‌లో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు.వర్షం వచ్చిదంటే నీరు లీకవుతోందని, అలాగే శిక్షణ పొందాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురుస్తుండటంతో నీరు లీక్ అవుతుండడంతో ప్లాస్టిక్ కవర్లు కప్పుకున్నారు. ప్రభు త్వం పక్కా భవనం నిర్మించి మా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.