Share News

సంక్షేమ హాస్టళ్లుగజ గజ..

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:41 AM

సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు గజ గజ వణికిపోతున్నారు. దుప్పట్లు లేక విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంక్షేమ హాస్టళ్లుగజ గజ..
పగిలిపోయిన కిటికీలు , ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో దుప్పట్లు లేక చలికి వణుకుతూ పడుకున్న విద్యార్థులు

ఆంధ్రజ్యోతి విజిట్‌

వణికిపోతున్న విద్యార్థులు

అందుబాటులో లేని నైట్‌ వాచ్‌మన్‌, వార్డెన్‌

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

కోసిగిలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో దుస్థితి

కోసిగి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు గజ గజ వణికిపోతున్నారు. దుప్పట్లు లేక విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లో కిటికీలు కూడా లేకపోవడంతో చల్లటి ఈదురు గాలులు విద్యార్థుల గదుల్లోకి వస్తుండటంతో చలికి వణికిపోతున్నామనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం

హాస్టల్‌లో కింద పడుకునేందుకు దుప్పట్లు ప్రభుత్వం ఇచ్చిందని, కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు తెలుపుతున్నారు. కోసిగి ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో 5 నుంచి 10వ తరగతి వరకు 146 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురురారం రాత్రి 9:30 గంటలకు హాస్టల్‌ను ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా.. విద్యార్థులు దుప్పట్లు చలికి వణుకుతూ దోమలతో ఇబ్బందుల పడుతూ నిద్రిస్తున్నారు. ఈ హాస్టల్‌లో నైట్‌ వాచ్‌మెన్‌, వార్డెన్‌ కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. హాస్టల్‌లో ఓ

ప్రైవేటు వ్యక్తి మాత్రమే ఉన్నారు. అయితే విద్యార్థులకు ఏదైనా జరిగితే అఢిగే నాథుడే లేడు. మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంపై హాస్టల్‌ వార్డెన్‌ గోపాల్‌ను వివరణ కోరగా.. తాను ఎమ్మిగనూరులో ఉన్నట్లు తెలిపాడు.

కిటికీలు బాగు చేయాలి

హాస్టల్‌లో కిటికీలు పగిలిపోవడంతో బయట నుంచి చల్లని గాలులు, దోమలు వస్తున్నాయి. హాస్టల్‌లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యను వార్డెన్‌కు చెప్పాం. పరిష్కరించడం లేదు. పగిలిపోయిన కిటీకీలు బాగు చేసి మాకు దుప్పట్లు ఇవ్వాలని కోరుతున్నాం. - అజయ్‌, 9వ తరగతి విద్యార్థి

దుప్పట్లు లేవు..

చలికి వణుకుతున్నాం

హాస్టల్‌లో కిటీకి అద్దాలు పగిలిపోయాయి. అందులో నుంచి చల్లగాలి వీస్తోంది. దుప్పట్లు లేకపోవడంతో చలికి వణుకుతూ అలాగే నిద్రపోతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. - ప్రవీణ్‌ కుమార్‌, 8వ తరగతి విద్యార్థి

Updated Date - Nov 28 , 2025 | 12:45 AM