ఆధార్ నమోదు బహుదూరం
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:26 AM
మండలంలో ఆధార్ సేవలు అందుబాటులో లేవు. గతంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.
హొళగుందలో గతంలో ఉన్నా అనంతరం నిలిపివేసిన అధికారులు
ఆధార్ నమోదుకు 50 కి.మీ.లు వెళ్లాల్సి వస్తోందని ప్రజల ఆవేదన
హొళగుంద, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆధార్ సేవలు అందుబాటులో లేవు. గతంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఆధార్ అప్‌డేట్, నమోదు చేయించాలంటే దాదాపు 30 కి.మీ.లలోని ఆదోని, ఆలూరుకు వెళ్లవలసి వస్తోంది. అలా కాని పక్షలంలో 50 కి.మీల. దూరంలోని కర్ణాటకలోని మోకా, బళ్ళారి, సిరుగుంప్ప వెళ్లాలి. లేదా జిల్లా కేంద్రం కర్నూలుకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యయ ప్రయాసలు
ఆధార్ నమోదుకు అంత దూరం వెళ్లేందుకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎన్నో ప్రయాసలు పడి రోజంతా అక్కడే కూర్చొని ఆధార నమోదు చేసుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధికారుల స్పంది ంచి హొళగుందలో ఆధార్ నమోదు కేంద్రాన్ని పునఃప్రారంభిం చాలని కోరుతున్నారు.
ఈ విషయంపై ఎంపీడీవో విజయలలితను వివరణ కోరగా రేషన్‌కార్డు నమోదు పనులతో పాటు సిబ్బంది కొరత ఉందని అందుకే ఆధార్ కేంద్రాలను నిలిపివేసినట్లు తెలిపారు.