ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:06 AM
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎస్‌ఎస్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది.
3,960 మంది విద్యార్థులు హాజరు
164 మంది గైర్హాజరు
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎస్‌ఎస్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను డీఈవో శామ్యూల్‌పాల్ పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,960 మంది హాజరయ్యారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరై జిల్లాలో 96 శాతం నమోదైనట్లు డీఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కర్నూలులో 6, ఆదోనిలో 9, పత్తికొండలో 9 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి నెలా స్కాలర్‌షిప్ మంజూరవుతున్నట్లు ఆయన తెలిపారు.