రైతుకు సేవల్లేవు?
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:24 AM
రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలందిండానికే ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మద్దికెర ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలందిండానికే ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో వ్యవసాయ గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) అందుబాటులో ఉండి సలహాలను సూచనలు ఇవ్వాలి. యూరియా, ఎరువులు తదితర వ్యవసాయ సేవలను అందించాలి. కానీ మద్దికెరలోని రైతుసేవా కేంద్రం-2 గురువారం మధ్యాహ్న ఒంటి గంట దాటినా తెరుచుకోలేదు. రైతులు ఎరువుల కోసం వచ్చి నిరాశతో వెనుదిరిగారు. ఏవో రవిని సంప్రదించగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.