రోడ్ల నిర్మాణంలో నూతన సాంకేతికత
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:59 PM
రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతిక పాటించడం వల్ల రోడ్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని వరంగల్ నిట్(ఎన్‌ఐటీ) ప్రొఫెసర్ శంకర్ అన్నారు.
వరంగల్ నిట్ ప్రొఫెసర్ శంకర్
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతిక పాటించడం వల్ల రోడ్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని వరంగల్ నిట్(ఎన్‌ఐటీ) ప్రొఫెసర్ శంకర్ అన్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా శనివారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పీఎంజీవైఎస్ రోడ్ల నిర్మాణం, నాణ్యతపై ఒకరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ కొత్త సాంకేతిక విధానాలు అవలంబించడం వల్ల రోడ్ల నాణ్యత ప్రమాణాలు పెరిగి డామేజీ కాకుండా ఉంటాయన్నారు. నిట్ అధ్వర్యంలో నూతన టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ వేణుగోపాల్, మహేశ్వరరెడ్డి, ఈఈ రఘురామిరెడ్డి, డీసీ వెంకటేష్, జి.పుల్లారెడ్డి కళాశాల ప్రొఫెసర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు