Share News

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:00 PM

మండలంలోని ఆర్‌ .పాంపల్లె గ్రామంలో నిర్వహించన కేంద్రబృంద పర్య వేక్షణలో ఆయా శాఖలకు సంబంధిం చిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించింది.

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం
వెలుగు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న కేంద్ర బృంద లీడర్‌ సంతోష్‌కుమార్‌

అసహనం వ్యక్తం చేసిన కేంద్ర బృందం

ఉయ్యాలవాడ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌ .పాంపల్లె గ్రామంలో నిర్వహించన కేంద్రబృంద పర్య వేక్షణలో ఆయా శాఖలకు సంబంధిం చిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించింది. నేషనల్‌ మోనిటరింగ్‌ టీమ్‌ లీడర్‌ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ పనులు వాటికి సంబందించిన ఆయా శాఖల రికార్డులను పరిశీలించారు. ముందుగా ఉపాధిహామీ కూలీలతో సంభాషించారు. పని దినాలు ఎన్ని కల్పిస్తున్నారు? పనికి తగ్గ వేతనం ఇస్తున్నారా లేదా? ఉపాధి హామీ పని బాగుందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 2022-23, 2023-24, 2024-25 ఏడాదిలకు సంబంధించిన ఉపాధి రికార్డు లను వారు పరిశీలించారు. వాటిలో కొన్ని పనులు పూర్తి చేయకుండానే ఎంబుక్‌లు క్లోజ్‌ చేసినట్లు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామ తీర్మానం రాయటం వచ్చా? రాదా? అని గ్రామ కార్యదర్శిని ప్రశ్నించారు. దీనికి ఆమె మౌనం వహించారు. అనంతరం వెలుగు శాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రూ.5 లక్షల సీఐఎఫ్‌ రికవరీ బిల్లులు, గ్రామ వీవోకు సంబం ధించిన రికార్డులు ఇవ్వాలని ఏపీఎంను, సీసీలను అడుగగా వారు తమ వద్ద లేవని, గతంలో పనిచేసిన వీవోఏ వద్ద ఉన్నాయని సమాధానం ఇచ్చా రు. అలాగే గ్రామైక్య సంఘం లీడర్లు, సభ్యులను చూపించాలని అడుగగా, వారు పలు కారణాల వల్ల రాలేదని చెప్పడంతో వారిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వెలుగు సిబ్బంది పనితీరుపై డీఆడీఏ పీడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర బృందం సభ్యుడు సూర్యకంట ప్రధాన్‌, సర్పంచ్‌ లక్ష్మీదేవి, ఎంపీటీసీ శివమ్మ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, తహసీల్దారు సువర్ణాదేవి, ఉపాధి ఏపీడీ సాంబశివరావు, ఏపీవోలు హరికృష్ణ, రవిప్రకాష్‌, పీఆర్‌ ఏఈ వెంకటయ్య, ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ ప్రణీత్‌కృష్ణ, వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:00 PM