ఇక్కడ చెత్త.. అక్కడ ప్రతిజ్ఞ
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తుంటే జిల్లా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తుంటే జిల్లా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో చెత్త కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలోని పార్కులో పోలీసులు ప్రజలను వారు పంపించి వేసి, డీఆర్‌వో ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి వెళ్లారు. అయితే పక్కనే ఉన్న ఈవీఎం గోడైన్ల వద్ద చెత్త విపరీతంగా ఉండి దుర్వాసన వస్తోంది. మరి ఈ అధికారులకు ఆ చెత్త కనిపించలేదో, ముక్కు మూసుకుని వెళ్లారో అర్థం కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.