‘నీట్’ను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ABN , Publish Date - May 03 , 2025 | 12:31 AM
నంద్యాలలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఈనెల 4న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి పరీక్షల చీఫ్ సూపరిం టెండెంట్లను ఆదేశించారు.
నంద్యాల ఎడ్యుకేషన్, మే 2(ఆంధ్రజ్యోతి): నంద్యాలలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఈనెల 4న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి పరీక్షల చీఫ్ సూపరిం టెండెంట్లను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్షపై శుక్రవారం పరీక్షల కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, టెక్కె ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1172 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు(ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్)తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తెచ్చుకోవాలని అన్నారు. మధ్యా హ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధా నంలో పరీక్ష జరుగుతుందని, ఉదయం 11గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రా ల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్ క్లోజ్ చేస్తారని, తర్వాత విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతి పరీక్ష కేంద్రంలో ద్విచక్ర చైర్‌లను ఏర్పాటు చేయాలని కోఆర్డినేటర్‌ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏ ఒక్క చిన్న ఘటన జరుగకుండా పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని పోలీసులను ఆదే శించామన్నారు.. కస్టోడియన్ బ్యాంకుకు వచ్చిన పరీక్ష పేపర్లను పోలీసుల సహకారంతో తీసుకు రావాలని ఆదేశాలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల సమీ పంలో జిరాక్స్ షాపులను మూసివేయిం చాలని, విద్యుత్‌కు అంతరాయం లే కుండా చూసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వెలుతురు ఉండేలా చూసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.